Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోతంగల్ లో ఓటు వేసిన కవిత

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన కవిత
  • టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందంటూ ధీమా
  • ఈ సారి కూడా వార్ వన్ సైడే అంటూ వ్యాఖ్య
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓటు వేశారు. నవీపేట్ మండలం పోతంగల్ లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీల గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించి, గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లో కూడా వార్ వన్ సైడే ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ది కోసం అన్ని పార్టీలను ఏకం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు.
kavitha
vote
TRS

More Telugu News